Home » బాల‌య్య కెరీర్‌లో డ్యూయ‌ల్ రోల్లో న‌టించిన సినిమాలు ఇవే..!

బాల‌య్య కెరీర్‌లో డ్యూయ‌ల్ రోల్లో న‌టించిన సినిమాలు ఇవే..!

by Bunty
Ad

నందమూరి బాలయ్య… నటించిన అఖండ సినిమా చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాతో థియేటర్లకు మరోసారి పూర్వవైభవం తీసుకొచ్చారు బాలయ్య బాబు. అయితే బాలయ్య ఇప్పటి వరకు చేసిన డ్యూయల్ రోల్ సినిమాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. ఈ అఖండ సినిమాలోనూ డబల్ ఆక్షన్ చేసి  అందరినీ ఆకట్టుకున్నాడు బాలయ్య. అయితే ఇప్పటివరకు బాలయ్య చేసిన డ్యూయల్ రోల్ సినిమాల వివరాలు తెలుసుకుందాం.

Advertisement

 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అపూర్వ సహోదరులు సినిమా లో బాలయ్య తొలిసారిగా రెండు పాత్రల్లో కనిపించారు. బాలయ్య రెండు పాత్రల్లో కనిపించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత బాలయ్య.. రాముడు-భీముడు సినిమా లో రెండు పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలయ్య మాతో పెట్టుకోకు… శ్రీకృష్ణార్జునయుద్ధం, పెద్దన్నయ్య, సుల్తాన్ మరియు చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా రెండు పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత అల్లరి పిడుగు మరియు ఒక్కమగాడు సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించారు.

Advertisement

అయితే ఈ సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయారు. ఆ మధ్యలో అధినాయకుడు సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించారు. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన పరమవీరచక్ర సినిమా లో కూడా బాలయ్య రెండు పాత్రల్లో… నటించిన హిట్ అందుకోలేకపోయాడు. అయితే బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు.. బంపర్ హిట్ కొట్టాయి. సింహ, లెజెండ్ మరియు అఖండ సినిమాలో రెండు పాత్రలు చేశారు బాలయ్య. ఈ మూడు సినిమాలు బంపర్ విజయాన్ని అందుకోవడం గమనార్హం.

Visitors Are Also Reading