తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకీ ఒక పెద్దన్నలా ఉన్నారు.. ఆయనకి ఎంతటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ నటనలో మాత్రం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్పవచ్చు. దీనికి ప్రధాన ఉదాహరణ బాలకృష్ణ నటించిన భైరవద్వీపం మూవీ.. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టం పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం..
also read:ఇంట్లో అంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లిగారికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…! ఆ హీరో ఎవరంటే…?
Advertisement
1994 సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన భైరవద్వీపం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ మూవీ గురించి ఒక షోలో శ్రీనివాస్ గారు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారని తెలియజేశారు. ప్రేక్షకులు ఎప్పుడు కూడా చూడని విధంగా బాలయ్యను ఈ సినిమాలో చూపించారు. ఇందులో చెప్పుకోవాల్సింది బాలకృష్ణ “కురూపి” పాత్ర, ఈ పాత్ర వెనకాల విపరీతమైన కష్టం దాగి ఉంది. ఈ పాత్ర కోసం పది రోజులపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గెటప్ లో ఉండేవారు. ఈ గెటప్ వేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.
Advertisement
అలాగే తీయడానికి కూడా రెండు గంటల సమయం పడుతుంది. ఇక ఆ గెటప్ లో భోజనం చేయడం అస్సలు కుదరదు. అందుకే ఒక స్ట్రా సహాయంతో జ్యూసులు మాత్రమే తాగేవారు. ఇక ఒక రోజున ఒక షాట్ కీ సంబంధించిన లైటింగ్ కి సమయం పడుతుందని, బాలకృష్ణ గారిని మధ్యాహ్నం 12 గంటలకు షూటింగ్ కి రమ్మని చెప్పాం. కానీ ఎన్టీఆర్ గారు ఒకవేళ లైటింగ్ ముందుగానే అయిపోతే నీవల్ల షూటింగ్ లేట్ కాకూడదు వెళ్ళు అని బాలకృష్ణ గారిని ముందుగానే పంపించారట, ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు కాబట్టి ఇంతటి స్టార్ గా ఎదిగారని దర్శకుడు శ్రీనివాస్ తెలియజేశారు.
also read:ప్రతి సినిమాలో కనిపించే ముఖేష్ ఎవరు? అతని స్టోరీ ఏంటి?