Home » బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. !

బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. !

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ‘వీర సింహారెడ్డి’ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. . ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కర్నూల్ లో టైటిల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం తరువాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.


ఇక ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ చూశాడు. కానీ అది కుదరలేదు. వస్తావానికి ఆయన 100వ సినిమా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్‌లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇపుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుందట. వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

Advertisement

Advertisement

Also Read :  రెండో పెళ్లి గురించి న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ ఏమన్నారంటే ?

ఈ సినిమాకి ‘రామారావు గారు’ అని టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ టైటిల్ బాలయ్య సినిమాకి పెడితే అదిరిపోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇందులో బాలయ్య 50 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల నటిస్తోందని అనిల్ తెలిపాడు. శ్రీలీల అయితేనే ఈ సినిమాకు బాగుంటుందని ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. బాలయ్య- అనిల్ కాంబోలో వచ్చే ఈ సినిమా హిట్ అవుతుందో కాదో వేచి చూడాలి.

Also Read :  టాలీవుడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన సెలెబ్రిటీలు వీరే..!

Visitors Are Also Reading