Home » బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమా మోహన్ బాబు చేసి హిట్ కొట్టారా..?

బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమా మోహన్ బాబు చేసి హిట్ కొట్టారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ ఇండస్ట్రీలో అయినా చాలామంది దర్శకులు హీరో హీరోయిన్లను నటీనటులను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తూ ఉంటారు. తీరా కథ పూర్తయ్యాక సదరు హీరో హీరోయిన్ ని సంప్రదిస్తే వారికి ఆ కథ నచ్చకనో లేదంటే డేట్స్ అడ్జస్ట్ కాకనో మొదట సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలను వేరే హీరో చేసి సూపర్ హిట్ అయిన హీరోలు ఎంతోమంది ఉన్నారు.. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథను మోహన్ బాబు చేసి హిట్టు కొట్టారు.అదేంటో చూద్దాం.. ఎన్నో సినిమాలు చేసిన మోహన్ బాబు ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో సతమత మవుతున్నాడు.

Advertisement

ఇదే టైంలో రాఘవేంద్రరావు ఆయనతో సినిమా చేద్దామనుకున్నారట. దీంతో చాలామంది మోహన్ బాబుతో సినిమా ఎందుకు పైగా అది కూడా రీమేక్.. కెరీయర్ కు ప్రాబ్లం అవుతుందని చెప్పారట. అయినా రాఘవేంద్రరావు పట్టించుకోకుండా అల్లుడుగారు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ మోహన్ బాబు కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ ముందుగా బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట.

Advertisement

మలయాళం లో సూపర్ హిట్ అయిన సినీమాని తెలుగు రీమేక్ అయ్యి అల్లుడుగారు గా వచ్చింది. 1988లో మలయాళంలో మోహన్ లాల్ రంజని ప్రధాన పాత్రల్లో చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట రాఘవేంద్రరావు. కానీ ఆయనకు కథ నచ్చకపోవడంతో మోహన్ బాబుతో చేశాడు. దీంతో ఈ సినిమా ఇండస్ట్రీలోనే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇందులో రమ్యకృష్ణ,శోభన హీరోయిన్లుగా నటించారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading