బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు చెబుతుంటారు. బాలయ్యతో సినిమాలు చేసిన దర్శకులు ఆయనతో కలిసి నటించిన నటీనటులు పలు ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. దానికి కారణం బాలకృష్ణ సినిమా ఫంక్షన్లు లేదంటే ఇతర కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఫోన్ పారేయడం… లేదా పక్కన ఉన్న అభిమానులను కొట్టడం చేస్తూ ఉంటారు. అయితే అభిమానులు కూడా బాలయ్య తమను కొట్టాడు అని బాధ పడకుండా తాకాడు అని చెప్పి ఎంతో సంతోషపడతారు.
Advertisement
ఫోన్ కూడా కోపంతో విసిరాడు అని కొందరు అనుకుంటారు కానీ అదే బాలయ్య స్టైల్ అని ఆయన అభిమానులు చెబుతుంటారు. అయితే అప్పట్లో ఓ సినిమా ఫంక్షన్ లో బాలయ్య ఫోన్ తీసి పక్కన విసిరేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరోసారి బాలయ్య అదేవిధంగా తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన విసిరేశారు. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా రీసెంట్ గా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు చిత్ర యూనిట్ తో పాటు బాలయ్య కూడా హాజరయ్యారు.
Advertisement
Also Read: సమంతతో విడాకుల పై తొలిసారి మీడియా ముందు స్పందించిన నాగ చైతన్య ..! ఏమన్నారంటే ?
ఇక స్టేజ్ మీదికి వెళుతున్న సందర్భంలో బాలయ్య తన చేతిలో ఉన్న ఫోన్ తీసి విసిరేశారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. పక్కనే ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను ఫోన్ తీసుకుని తన చేతిలో పట్టుకున్నారు. ఇక బాలయ్య వెనకాల నిల్చున్న హీరో శ్రీకాంత్ కూడా నవ్వుతూ బాలయ్య వెనక వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక వీడియో చూసిన అభిమానులు జై బాలయ్య అంటూ తమదైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు.