Telugu News » Blog » బాలకృష్ణ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటంటే..?

బాలకృష్ణ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటంటే..?

by Anji
Ads

ఇదివ‌ర‌కు కేవ‌లం సినిమాల ద్వారా వ‌చ్చే పారితోషికాల ద్వారా మాత్ర‌మే ఆదాయ‌మును ద‌క్కించుకునే వారు సినీ న‌టులు. కొంద‌రూ మాత్రం భూముల‌ను కొనుగోలు చేసే వారు. ఎక్కువ శాతం మంది అప్ప‌ట్లో సినిమా ఇండ‌స్ట్రీలో పెట్టుబ‌డులు పెట్టేవారు. ఇప్పుడు ఉన్న హీరోలు ఎన్నో మార్గాల ద్వారా డ‌బ్బు సంపాదిస్తున్నారు. త‌మ‌కు ఉన్న క్రేజ్ ను ఉప‌యోగించుకుని కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొంద‌రూ హీరోలు సినిమాల కంటే ఇత‌ర ఆదాయాలు ఎక్కువ‌గా క‌లిగి ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.50కోట్ల సినిమాల ద్వారా సంపాదిస్తే.. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డం ద్వారా అంత‌కు మించి ఆదాయంను ద‌క్కించుకుంటున్నారు.

Advertisement

Nandamuri Balakrishna: Balayya to play a no-nonsense cop in KS Ravikumar's  next | Telugu Movie News - Times of India

ఎక్కువ‌గా మ‌హేష్‌బాబు మాత్ర‌మే ప్ర‌స్తుతం స్టార్ హీరోల‌లో బ్యాక్ టూ బ్యాక్ క‌మ‌ర్షియ‌ల్ చేస్తున్నారు. ఇత‌ర హీరోలు ఒక‌టి రెండు క‌మ‌ర్షియ‌ల్ చేస్తున్నారు. కానీ కొంద‌రూ హీరోలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు క‌నీసం ఒక్క‌టి అంటే ఒక్క క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ను కూడా చేయ‌లేదు. కోట్ల పారితోష‌కం ను కూడా కాదు అని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కు నో చెబుతున్నారు. అందులో బాల‌కృష్ణ ఒక‌రు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. 1990లో బాల‌య్య వ‌ద్ద‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ప్ర‌పోజ‌ల్ వెళ్లింద‌ట‌. ఆ స‌మ‌యంలో బాల‌య్య ఇండ‌స్ట్రీలో టాప్ హీరో అనే విష‌యం తెలిసిన‌దే. భారీ పారితోషికం ఇవ్వ‌డానికి కంపెనీ ముందుకు వ‌చ్చింద‌ట‌. కానీ బాల‌య్య మాత్రం క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ను చేసే ఉద్దేశం లేద‌ని నిర్మోహ‌మాటంగా చెప్పేసాడ‌ట‌.

Advertisement

Advertisement

Bul Bul Balayya, the most trolled actor in 2018!

కేవ‌లం అప్పుడు మాత్ర‌మే కాదు.. ఆ త‌రువాత ఎన్నో బ‌డా కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా కోరార‌ట‌. కానీ బాల‌య్య మాత్రం ఏ ఒక్క బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. కోట్ల రూపాయ‌లు పారితోషికం కూడా వ‌ద్ద‌న్న బాల‌య్య జ‌నాల‌ను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్ర‌చార వీడియోల్లో న‌టించ‌డానికి నో చెప్పాడు. ఆయ‌న స‌న్నిహితుల మాట ఏదైనా ఒక ఉత్ప‌త్తి గురించి మాట్లాడాలంటే అందులో నూరు శాతం నిజం ఉండ‌దు. క‌నుక జ‌నాల‌ను మోసం చేస్తూ.. డ‌బ్బు సంపాదించ‌డం ఇష్టం లేదు కాబ‌ట్టే బాల‌య్య ఎప్పుడు కూడా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఇలా ఎంత మంది హీరోలుంటారు చెప్పండి. కోట్ల రూపాయ‌ల పారితోషికం కాద‌నుకున్న టాలీవుడ్ హీరోలు కొద్ది మంది ఉన్నారు.