Home » ప్రభాస్ కు పోటీ నేనే అంటున్న బాలయ్య..!

ప్రభాస్ కు పోటీ నేనే అంటున్న బాలయ్య..!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు అనేది తెలిసిందే. గత ఏడాది చివరగా ఆయన నుండి వచ్చిన అఖండ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ప్రభాస్ కు నేనే పోటీ అని అంటున్నాడు బాలయ్య. అయితే బాలయ్య ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో సినిమా అనేది చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ అనేది పెట్టలేదు.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనేది వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ అనేది జనాలకు బాగా నచ్చడంతో ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బాలయ్య 107వ సినిమా అనేది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మన దగ్గర సంక్రాంతికి సినిమా రిలీజ్ అనేది కూడా పెద్ద పండుగే. ఆ సమయంలో వచ్చిన సినిమాలు ఏవైనా కథ బాగుంటే సూపర్ హిట్ అవుతాయి అనేది అందరికి తెలుసు.

Advertisement

అయితే ఇప్పటికే సంక్రాంతికి ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ అనేది రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి తెలుగు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అలాగే విజయ్ దళపతి యొక్క వారసుడు అనే సినిమాకూడా సంక్రాంతికే వస్తుంది. కాబట్టి ఈ హీరోలకు పోటీగా వస్తున్న బాలయ్య.. 107వ సినిమా అనేది ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

అర్జున్ టెండూల్కర్ రికార్డ్.. ముంబై ఏడుస్తుంది కావచ్చు..!

అవ్వని కనిపించట్లేదా అంటున్న గంగూలీ..!

Visitors Are Also Reading