Home » Unstoppable with nbk : చిన్నారుల‌ హార్ట్ ఆప‌రేష‌న్ల‌ వెన‌క క‌న్నీళ్లు పెట్టించే క‌థ చెప్పిన మ‌హేశ్ బాబు..!

Unstoppable with nbk : చిన్నారుల‌ హార్ట్ ఆప‌రేష‌న్ల‌ వెన‌క క‌న్నీళ్లు పెట్టించే క‌థ చెప్పిన మ‌హేశ్ బాబు..!

by AJAY
Ad

గ‌త కొద్దిరోజులుగా ఊరిస్తున్న మ‌హేశ్ బాబు బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్ కు వేళ‌య్యింది. ఈ ఎపిసోడ్ ను ఫ్రిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌సారం చేస్తున్న‌ట్టు ఆహా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాల‌య్య మ‌హేశ్ బాబు ప్రోమోను విడుద‌ల చేశారు.. ఈ ప్రోమో ఎంతో ఆక‌ట్టుకునే విధంగా ఉంది. అంతే కాకుండా ఎంతో ఎమోష‌నల్ గా కూడా ఉంది. సైలెంట్ గా ఉండే మ‌హేశ్ బాబుతో వైలెంట్ గా ఉండే బాల‌య్య నెవ‌ర్ బిఫోర్ ఎంట‌ర్టైన్ మెంట్ ఇచ్చారు. ఇక ఎపిసోడ్ ప్రారంభంలో కేబీఆర్ పార్క్ లో ర‌న్నింగ్ చేస్తున్న స‌మ‌యంలో తాను పెద్ద పామును చూసాన‌ని మ‌హేశ్ బాబు తెలిపారు.

Advertisement

ఆ పామును స‌డెన్ చూసి వెన‌కు ప‌రిగెత్తాన‌ని మళ్లీ కేబీఆర్ పార్క్ వైపు చూడ‌లేద‌ని చెప్పారు. అంతే కాకుండా తాను షూటింగ్ లో ఉన్న స‌మయంలో ప‌క్క‌నే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సీన్ అయిపోయినా క‌ట్ చెప్ప‌కుండా ఫోన్ చూస్తూనే ఉందని కోపం వ‌చ్చి ఫోన్ ప‌క్క‌న పెట్టండి అని చెప్పాన‌ని తెలిపారు అదే మీర‌యితే మైక్ విసిరేసేవార‌ని అన్నారు. మీరు కూడా మీ నాన్న లాగా పంచ్ లు వేస్తారట క‌దా అంటూ బాల‌య్య మ‌హేశ్ బాబును అడ‌గ్గా వేస్తాను కానీ నా పంచ్ ల‌లో టైమింగ్ ఉండ‌దంటూ మహేశ్ బాబు ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చారు. దాంతో నేను టైమింగ్ తెప్పిస్తాగా అంటూ బాల‌య్య వ్యాఖ్యానించారు.

Advertisement

ఇక మ‌హేశ్ బాబు త‌న ట్ర‌స్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్ లు చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌హేశ్ బాబు హార్ట్ ఆప‌రేష‌న్ చేయించిన ఓ చిన్నారి త‌ల్లిదండ్రుల‌ను బాల‌య్య స్టేజ్ పైకి పిల‌వ‌గా మ‌హేశ్ బాబు ఎమోష‌న‌ల్ అయ్యారు. దాంతో ఇంత మంది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్ లు చేయించ‌డం వెన‌క రీజ‌న్ ఏంటి ఆ ఆలోచ‌న ఎలా వ‌చ్చింద‌ని అడిగారు.

దానికి మ‌హేశ్ బాబా స‌మాధానం ఇస్తూ త‌న కొడుకు గౌత‌మ్ ఆరు వారాలు ముందుగానే పుట్టాడ‌ని పుట్టిన స‌మ‌యంలో చాలా చిన్న‌గా అరచేయి సైజులో ఉన్నాడ‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌మ‌కు డ‌బ్బు ఉంది కాబ‌ట్టి ట్రీట్మెంట్ తీసుకున్నామ‌ని మ‌రి డ‌బ్బు లేని చిన్నారుల పరిస్థితి ఏంట‌ని అప్పుడు తాను ఆలోచించి హార్ట్ ఆప‌రేష‌న్ లు చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు.

also read : పెళ్లి తర్వాత కూడా అలాంటి పనులు….స్టార్ డాటర్స్ విడాకుల పై శ్రీరెడ్డి ఫైర్…!

Visitors Are Also Reading