Home » ఏషియ‌న్ తార‌క‌రామ థియేట‌ర్ ను ప్రారంభించిన బాల‌య్య‌…ఆ థియేట‌ర్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

ఏషియ‌న్ తార‌క‌రామ థియేట‌ర్ ను ప్రారంభించిన బాల‌య్య‌…ఆ థియేట‌ర్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

by AJAY
Ad

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఏషియ‌న్ తార‌క‌రామ థియేట‌ర్ ను నేడు ప్రారంభించారు. కాచిగూడ లో నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన తార‌క‌రామ థియేట‌ర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అదే థియేట‌ర్ ను ఇప్పుడు మాడిఫై చేశారు. కొత్త హంగుల‌తో థియేట‌ర్ ను తీర్చిదిద్దారు. ఏషియ‌న్ సంస్థ‌తో పార్ట్ న‌ర్ షిప్ లో థియేటర్ లో స‌రికొత్త స‌దుపాయాల‌ని కల్పిస్తూ థియేట‌ర్ పేరును కూడా ఏషియ‌న్ తార‌క‌రామ గా మార్చారు.

Advertisement

ఇక సరికొత్త స‌దుపాయాల‌తో తీర్చిదిద్దిన త‌ర‌వాత నేడు బాలయ్య రిబ్బ‌న్ క‌త్తిరించి రీఓపెన్ చేశారు. ఈ సంధ‌ర్బంగా బాల‌య్య కాచిగూడ‌కు రావ‌డంతో అభిమానులు కూడా అక్క‌డకు పెద్ద ఎత్తున చేరుకుని సందడి చేశారు. జై బాల‌య్య అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. ఇక ఈ థియేట‌ర్ లో ఈనెల 16వ తేదీ నుండి సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభం కానుంది. ఇదిలా ఉండ‌గా ఈ థియేట‌ర్ ను దివంగ‌త సీనియర్ ఎన్టీఆర్ నిర్మించారు.

Advertisement

అంతే కాకుండా ఎన్టీఆర్ స్నేహితుడు నిర్మాత నారాయ‌ణ్ దాస్ కే నారంగ్ మ‌ర‌మ‌త్తులు చేప‌ట్టారు. కానీ ఇప్పుడు నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ థియేట‌ర్ ను కొత్త టెక్నాల‌జీతో తీర్చిదిద్దాడు. థియేట‌ర్ లో 4కే ప్రొజెక్ష‌న్ తో పాటూ సుపీరియర్ సౌండ్ సిస్ట‌మ్ ను అమ‌ర్చారు. 975 సీటింగ్ కెపాసిటీ గ‌తంలో ఉండ‌గా దాన్ని 590కి త‌గ్గించారు.

అంతే కాకుండా థియేట‌ర్ లో కొత్త సీట్ల‌ను మ‌రియు సోఫాల‌ను సైతం ఏర్పాడు చేశారు. ఈ నెల 16న విడుద‌ల కాబోతున్న అవ‌తార్ పార్ట్ 2 తో ఈ థియేట‌ర్ రీఓపెన్ కానుండ‌గా సంక్రాంతికి బాల‌య్య హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాను సైతం ఇందులో ప్ర‌దర్శించనున్నారు. మ‌రి ఎన్టీఆర్ గ‌తంలో నిర్మించిన థియేట‌ర్ ఇప్పుడు లాభాల‌ను తెచ్చిపెడుతుందా లేదా చూడాలి.

Visitors Are Also Reading