Telugu News » Blog » బాలయ్యలో మరో యాంగిల్… ఏఎన్నార్ ను ఇమిటేట్ చేస్తూ..!!

బాలయ్యలో మరో యాంగిల్… ఏఎన్నార్ ను ఇమిటేట్ చేస్తూ..!!

by Bunty
Ads

నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాము. అయితే “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” వచ్చే వరకూ ఆయనలో మనం చూడని యాంగిల్ యాంకర్. సాధారణంగా ఒక స్టార్ హీరో యాంకర్ గా మారతాడని ఎవరూ అనుకోరు. పైగా స్టార్ హీరోలు సైతం ఒక స్టేటస్ వచ్చాక యాంకరింగ్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఇటీవల కాలంలో ఆ ట్రెండ్ మారింది. స్టార్ హీరోలంతా బుల్లితెరను ఆక్రమించేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే”అనే పాపులర్ సెలెబ్రిటీ టాక్ షోతో ప్రేక్షకులకు “అన్‌స్టాపబుల్” ఫన్ అందిస్తున్నారు. ఈ షోకు గెస్టులను ఆహ్వానించి, వారితో చమత్కారంగా మాట్లాడడమే కాకుండా పలు సీరియస్ కోణాలనూ తాకుతున్నారు. మొత్తానికి షోకు “అన్‌స్టాపబుల్” రెస్పాన్స్ వస్తోంది. తాజాగా బాలయ్య ఈ షోలో లెజెండరీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావును ఇమిటేట్ చేయడం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement

Balayya

Balayya

Advertisement

తాజాగా ‘ఆహా’లో ప్రసారం అవుతున్న 3వ ఎపిసోడ్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లోనే బ్రహ్మానందం బాలయ్యను సరదాగా ఏఎన్నార్ ను ఇమిటేట్ చేయమని అడిగారు. బాలయ్య సైతం అద్భుతంగా ఎన్నార్ ను ఇమిటేట్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ గా ఆయన డైలాగులను కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ తన తాజా చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.