Home » Video : ఫోటో కోసం చిన్నారిని నిద్రలేపిన బాలయ్య….వీడియో వైరల్…!

Video : ఫోటో కోసం చిన్నారిని నిద్రలేపిన బాలయ్య….వీడియో వైరల్…!

by AJAY

నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజాగా ఉన్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో తో ప్రేక్షకులను అలరించారు. ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ షోను పూర్తి చేసుకున్న తరవాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఓ సినిమా ను ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమా నుండి బాలయ్య లుక్ ను రిలీజ్ చేయగా ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగానే బాలకృష్ణ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాల విషయం పక్కన పెడితే బాలయ్య ఎక్కడ కనిపించినా అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. బాలయ్య తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు లైన్ కడతారు. ఈ క్రమంలో బాలయ్య ఫోన్ విసిరేయడాలు….. సెల్పీ కోసం వచ్చిన అభిమానులను కొట్టడాలు జరిగిన సంగతి తెలిసిందే.

BALAKRISHNA

BALAKRISHNA

వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి ట్రోలర్స్ కు దొరికిపోయాడు. బాలకృష్ణ ఓ కార్యక్రమంలో అభిమానులతో ఫోటో దిగుతున్నాడు. కాగా బాలయ్య పక్కనే ఉన్న అభిమాని ఓ పాపను ఎత్తుకుని ఉన్నాడు. ఆ పాప పడుకుని ఉండటం తో బాలయ్య తన చేతితో తట్టిమరీలేపి ఫోటో దిగమన్నాడు.

Balakrishna

Balakrishna

దాంతో ఆ చిన్నారిని ఒక్కసారిగా షాక్ అయ్యింది.ఇక బాలయ్య చిన్న పిల్లల్ని కూడా కొట్టి లేపాలా అంటూ కొంతమంది ట్రోల్ చేస్తుంటే మరికొందరు అది బాలయ్య ప్రేమ అని…ఆ పాప జీవితాంతం గుర్తు పెట్టుకునే సన్నివేశం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య తో కలిసి పని చేసిన నటీ నటులు ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అని చెబుతూ ఉంటారు.

 

Visitors Are Also Reading