Home » చరిత్ర సృష్టించాలన్నా మేమే…. తిరగరాయాలన్నా మేమే : బాలయ్య

చరిత్ర సృష్టించాలన్నా మేమే…. తిరగరాయాలన్నా మేమే : బాలయ్య

by AJAY
Published: Last Updated on
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా ప్రాగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహా లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు కాగా అఖండ సినిమా తో వీరి కాంబినేషన్ లో హాట్రిక్ కొట్టారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై నేటికి 100 రోజులు పూర్తయ్యింది. సినిమా వంద రోజుకు థియేటర్ లలో ఆడగా నేడు సినిమా వంద రోజుల కృతజ్ఞతా సభను కర్నూలు లో ఏర్పాటు చేశారు. ఇక ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ …..చరిత్ర సృష్టించాలన్నా మేమే….దాన్ని తిరగరాయాలన్నా మేమే అని అన్నారు. తమ సినిమాలే తమకు పోటీ అని బాలయ్య వ్యాఖ్యానించారు.

సింహా లెజెండ్, అఖండ దేనికి అవే సాటి అని వ్యాఖ్యానిచారు. నటన అంటే ఏడవడమో అరవడమో కాదని…..నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అని బాలయ్య అన్నారు. అఖండ సినిమాకు తమన్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చాడని బాలయ్య అన్నారు. సౌండ్ దెబ్బకు అమెరికాలో స్పీకర్ లు బద్దలు అయ్యాయి అంటూ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading