Home » బాల‌కృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో కీల‌క పాత్ర‌లో ఆ సీనియ‌ర్ హీరో..!

బాల‌కృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో కీల‌క పాత్ర‌లో ఆ సీనియ‌ర్ హీరో..!

by Anji
Ad

టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒక‌రైన బాల‌కృష్ణ ఇటీవ‌లే అఖండ సినిమాతో హిట్ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఎఫ్‌3 సినిమా ద‌ర్శ‌కుడు బంప‌ర్ హిట్ అందుకున్నారు. ఈ ఇద్ద‌రి కాంబోలో సినిమా అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. కామెడీతో కూడిన మాస్ మ‌సాలా అందించేవిధంగా ఉంది. నంద‌మూరి అభిమానులు సినిమా అప్‌డేట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తాజాగా బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా అనిల్ రావిపూడి కీల‌క అప్‌డేట్ ఇస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. అదేవిధంగా ఫ్యాన్స్‌ను కూడా ఖుషి చేసారు. ఈ చిత్రానికి NBK108 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కిస్తున్నారు. కీల‌క అప్‌డేట్ ఏమిటంటే బాల‌కృష్ణ‌తో పాటు సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కూడా న‌టించ‌నున్నార‌ట‌. వీరి కాంబోలో వ‌చ్చే సీన్లు ఈ చిత్రానికి హైలెట్ అవుతాయ‌ని.. అంద‌క‌నుగుణంగా క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే శేఖ‌ర్ సినిమాతో ఆక‌ట్టుకున్న రాజ‌శేఖర్‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న కూడా ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇందులో రాజ‌శేఖ‌ర్ పాత్ర కీల‌కంగా ఉండ‌డంతో స్పెష‌ల్‌గా రాజ‌శేఖ‌ర్ కోసం కొన్ని సీన్స్ సిద్ధం చేశార‌ట ద‌ర్శ‌కుడు అనిల్‌.

Advertisement

ఇక ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో పెళ్లి సంద‌డి ఫేమ్ శ్రీ‌లీల బాల‌కృష్ణ‌కు కూతురిగా న‌టించ‌నుంది. ఫుల్ కామెడీ చిత్రాల‌ను తీసే అనిల్ బాల‌కృష్ణ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కామెడీ జ‌త చేస్తూనే మాస్ ఎలివేష‌న్ ఉండేవిధంగా క‌థ రాసుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్‌ను భాగం చేస్తున్నార‌ని తెల‌వ‌డంతో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. ప్ర‌స్తుతం బాల‌య్య గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు పోస్ట‌ర్స్‌, ఫ‌స్ట్ హంట్ విడుద‌ల చేసారు.

Also Read : 

జాన్వీక‌పూర్ తెలుగులో ఏ హీరోతో చేయ‌నుందో తెలుసా..?

Visitors Are Also Reading