Home » 50 కోట్ల బడ్జెట్ తో తీసిన చిరు, బాలయ్య పాన్ ఇండియా సినిమాలు ఎందుకు మధ్యలోనే నిలిచిపోయాయి…?

50 కోట్ల బడ్జెట్ తో తీసిన చిరు, బాలయ్య పాన్ ఇండియా సినిమాలు ఎందుకు మధ్యలోనే నిలిచిపోయాయి…?

by AJAY
Ad

టాలీవుడ్ లోని మూడో త‌రం స్టార్ హీరోల లిస్ట్ లో బాల‌య్య‌, చిరంజీవిలు కూడా ఉంటారు. చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో విల‌న్ పాత్ర‌లు వేసి ఆ త‌ర‌వాత హీరో అవ‌కాశాలు అందుకున్నాడు. హీరోగా ఎన్నో సూప‌ర్ హిట్ లు అందుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా త‌న వార‌సులుగా ఇండ‌స్ట్రీకి కుమారుడితో పాటూ మేన‌ల్లుళ్ల‌ను సైతం ప‌రిచ‌యం చేశాడు.

chiranjeevi-balayya

Advertisement

ఇక బాల‌య్య విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్ న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో త‌న దైన స్టైల్ న‌టించి మెప్పించాడు. ఎలాంటి పాత్ర‌లో అయినా ఒదిగిపోతూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇప్ప‌టికీ బాల‌య్య‌, చిరంజీవిలు కుర్ర‌హీరోల‌కు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. థియేట‌ర్ ల వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్ప‌డే కాదు ఒక‌ప్పుడు కూడా నిర్మాత‌లు కోట్లు పెట్టి సినిమాలు తీసేవారు.

Advertisement

అయితే బాల‌య్య‌, చిరు ఇద్దరి కెరీర్ లోనూ ఒక్కొక్క‌రుగా భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను మిస్ చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు ఎందుకు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి…? ఇంత‌కీ ఆ సినిమాలు ఏవి అన్న‌ది ఇప్పుడు చూద్దాం….అబు బ‌గ్దాద్ గ‌జ‌దొంగ అనే సినిమాను చిరంజీవి హీరోగా ప్లాన్ చేశారు. సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 50 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను ప్రారంభించారు. కానీ ముస్లీం పెద్ద‌ల‌ నుండి తీవ్రంగా వ్య‌తిరేక‌త రావ‌డంతో ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

ఇదిలా ఉంటే 20 ఏళ్ల క్రితం బాల‌య్య హీరోగా విక్ర‌మ సింహా భూప‌తి అనే సినిమాను ప్రారంభించారు. కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను ప్రారంభించారు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఈ సినిమా స‌మ‌యంలో కోడి రామ‌కృష్ణ బాల‌య్య మ‌ధ్య విభేదాలు రావ‌డంతో సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

Visitors Are Also Reading