ఏపీలో సినిమా టికెట్ల వివాదం గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ల ధరల వల్ల పరిమితుల వల్ల పెద్ద సినిమాలకు నష్టాలు వస్తాయని నిర్మాతలు మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర సినీ పెద్దలు సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్లారు. అయితే ఈ సమావేశానికి బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదని చాలా మంది అనుకున్నారు. కానీ నిజానికి వీరిద్దరికీ ఆహ్వానం అందినా వెళ్లలేదని తెలుస్తోంది.
Advertisement
Advertisement
Balakrishna
ఇక తాను వెళ్లకపోవడానికి గల కారణాన్ని నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా తెలిపారు. ఇటీవల బాలయ్య తాను తన నియోజక వర్గం ప్రజల కోసం సీఎం దగ్గరకు వెళతానని కానీ సినిమాల కోసం వెళ్లనని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా బాలయ్య సీఎం తో సమావేశానికి తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. కానీ తాను రానని చెప్పానన్నారు. తాను సినిమా బడ్జెట్ ను పెంచనని సీఎం జగన్ ను కలవనని అన్నారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడే అఖండ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని అదే ఒక ఉదాహరణ అని బాలయ్య వ్యాఖ్యానించారు.
Ad