Home » ఆదిత్య 369 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

ఆదిత్య 369 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే 100 కు పైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రం అందరికి ఎప్పటికి గుర్తుండిపోతాయి. అలంటి సినిమాలో ఆదిత్య 369 సినిమా కూడా ఒక్కటి. టైం ట్రావెల్ పైన వచ్చిన ఈ సినిమా అనేది సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత ఇలాంటి కాన్సెప్ట్ తో మరో సినిమా అనేది రాలేదు.

Advertisement

కానీ ఆదిత్య 369 సినిమాకే సీక్వెల్ అనేది రానున్నట్లు చాల రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో బాలయ్య క్లారిటీ ఇచ్చేసాడు. అయితే బాలయ్య.. ఆహ వేదికగా ఓ షో హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలోనే బాలయ్య మాట్లాడుతూ.. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ సినిమా అనేది రానుంది. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ పెట్టినట్లు చెప్పారు.

Advertisement

అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటపెట్టి ఫ్యాన్స్ కు షాక్ చేసాడు బాలయ్య. అదేంటంటే.. ఈ సినిమాను కథ అనేది స్వయంగా తానే రాసినట్లు బాలయ్య ప్రకటించాడు. అలాగే వచ్చే ఏడాది ఈ ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని పేర్కొన్నారు. అయితే స్వయంగా బాలయ్య రాసిన ఈ కథను తానే డైరెక్ట్ చేస్తాడా.. లేదా ఎవరి చేతిలో అయిన ఈ సినిమాను పెడతారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

నేను ఇంకా జట్టులో ఉండటానికి కారణం అతనే..!

సీన్ రివర్స్.. ఫ్యాన్స్ ను ట్రోల్ చేసిన షాహిన్..!

Visitors Are Also Reading