Home » కార్తీక మాసంలో పరమ శివుని చూసాము… బాలయ్య అభిమాని హడావిడి !!

కార్తీక మాసంలో పరమ శివుని చూసాము… బాలయ్య అభిమాని హడావిడి !!

by Bunty
Ad

డిసెంబర్ 2న నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” భారీ ఎత్తున విడుదలైంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో మూడో సారి వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ హిట్ సాధించింది. ఫస్ట్ షో తోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కావలసినంత వచ్చింది. చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా ‘అఖండ’ అంటూ ప్రశంసల వర్షం కురిసింది. ఓవైపు సినిమా విజయంతో చిత్రబృందం సైతం సంతోషంగా ఉన్నారు. అయితే అభిమానుల హడావుడి మాత్రం వేరే లెవెల్ లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని బాలకృష్ణ పై తన అభిమానాన్ని వ్యక్తం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

Advertisement

అందులో అభిమాని బాలయ్య కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. “కార్తీకమాసంలో పరమ శివుని చూసేసాము. బాలకృష్ణ అభిమానులము అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది అన్నయ్య. ఈ జీవితానికి ఇది చాలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం అఖండ జాతర జరుగుతోంది అన్నయ్య. మీతో భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు అన్నయ్య. మీకు అభిమానులుగా పుట్టకపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేదో చెప్పండి? మిమ్మల్ని ఇన్నేళ్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రతి అభిమానికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది అన్నయ్య” అంటూ అభిమాని బాలకృష్ణ నట విశ్వరూపంపై ప్రశంసల వర్షం కురిపించడం ఆ వీడియోలో వినిపిస్తోంది. బాలయ్య సైతం సంతోషంగా ప్రశంసలు అందుకుంటూ తన అభిమానిపై ఆత్మీయతను చాటుకున్నారు.

Advertisement

బాలయ్య అభిమాని మాటలు వినడానికి కింద క్లిక్ చేయండి ”

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&v=448638576778371

Visitors Are Also Reading