ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు రావడంతో చిత్రబృందం పై ప్రతిఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్కార్ లాంటి అవార్డు తెలుగు సినిమాకు రావడం అంటే అది తెలుగువారంతా గర్వించదగ్గ విషయం. దాంతో సినిమా తారలు రాజకీయ ప్రముఖలు ఇతర సెలబ్రెటీలు అందరూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.
Advertisement
ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య కూడా చిత్రయూనిట్ ను అభినందిస్తూ లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖలో బాలయ్య తీరుతో బాబాయ్ అబ్బాయ్ ల సంబంధాల పై మరోసారి నెట్టింట చర్చజరుగుతోంది.
Advertisement
బాలయ్య రాసిన లేఖలో….ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు..నాటునాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయసినీచరిత్రలో అపూర్వఘట్టం. తెలుగుజాతితో పాటూ దేశం గర్వించదగ్గ విజయం ఇది. స్వరకర్త కీరవాణికి..రచయిత చంద్రబోస్ కు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు..అంటూ పేర్కొన్నారు.
అయితే లేఖలో ఎన్టీఆర్ పేరును బాలయ్య ప్రస్తావించలేదు. ఎన్జీఆర్ కూడా ఆ పాటలో భాగం అయ్యారు. అంతే కాకుండా సొంత అన్నకొడుకు కాబట్టి ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఇద్దరి మధ్య దూరం ఉండటం వల్లే బాలయ్య ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదని కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ALSO READ :రాజమౌళి తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ని తీసుకోకపోవడానికి కారణం అదేనా ?