Home » Balagam Movie OTT : ‘బలగం’ మూవీ ఓటేటి రిలీజ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Balagam Movie OTT : ‘బలగం’ మూవీ ఓటేటి రిలీజ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Bunty
Published: Last Updated on
Ad

Balagam Movie OTT Platform: ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన వేణు జబర్దస్త్ షోలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. వేణు బలగం సినిమాలు తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోగా ప్రియదర్శి, హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. Check Out the Latest News of Balagam Movie OTT Release 

READ ALSO : టీమిండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో నటిస్తున్న శిఖర్​ ధావన్​!

Advertisement

Advertisement

Balagam Movie OTT

Balagam Movie OTT

చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా నటించిన ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బలగం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

బలగం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయినా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. అన్ని కుదిరితే ఏప్రిల్ మొదటి వారంలో అంటే ఏప్రిల్‌ 2వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

Visitors Are Also Reading