కథ కాన్సెప్ట్ బాగుండాలి కానీ ఆ సినిమాను ఏ విధంగా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు.. కథ కాన్సెప్ట్ బాగా లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎన్ని ప్రమోషన్స్ నిర్వహించినా సినిమా చూడ్డానికి ఎవరూ వెళ్లరు. వెళ్లిన నిరాశపడతారు.. కథ నచ్చితే సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ప్రత్యేకమైన ఉదాహరణ బలగం మూవీ.
read also : Shaakuntalam : “శాకుంతలం” ఫ్లాప్ టాక్ రావడానికి ఈ మైనస్ లే కారణమా..?
Advertisement
పూర్వకాలంలో సినిమాకి వెళ్లడానికి ఊరు ఊరంతా కలిసి వెళ్లేవారు అని దానికి నిదర్శనం ఈ బలగం.. పల్లెటూరి చావు, సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వేణు. అయితే… ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు బలగం టైటిల్ వెనక ఉన్న ఇన్సైడ్ స్టోరీని బయటపెట్టారు. బలగం టైటిల్ ను నిర్మాత దిల్ రాజు అసలు ఒప్పుకోకపోవడంతో చాలా కష్టపడి కన్విన్స్ చేయాల్సి వచ్చిందన్నారు. బలగం అనే పేరు తెలంగాణలో మాత్రమే అర్థమవుతుందని, ఏపీ ప్రజల్లోకి ఈ టైటిల్ వెళ్లడం కష్టమని దిల్ రాజు వేణు తో అన్నారట.
Advertisement
read also : Vishnu priya : దేవుడా.. ముద్దుల కోసం బరితెగించిన విష్ణు ప్రియ !
దీంతో ఈ టైటిల్ కు ప్రత్యామ్నాయంగా నిండుకుండ, వాళ్ల గోస, మాయ డప్పు, మన కథ, గోవిందా… గోవిందా, పైలంబిడ్డ, బండెనుక బండి కట్టి, పాకులాట, ఆలాయ్ బలాయ్, దీవెనార్థి, భద్రం కొడుక, పిట్ట, బాపు, బలం, పల్లెటూరు తో పాటు… యాధికోస్తున్నవే, మా బాపు కొమురయ్య, పండగ, పండగ చేద్దాం, ఆనందంగా తదితర అనేక టైటిల్స్ ను అనుకున్నామని ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు చెప్పారు. అయితే, చివరికి ఈ సినిమాకు బలగం అనే టైటిల్ ఉంటేనే కరెక్ట్ అని దిల్ రాజును ఒప్పించానని వివరించారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ సినిమాకు బలం అని నిరూపితమైందని సంతోషం వ్యక్తం చేశారు వేణు.
READ ALSO : మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!