యాషేస్ సిరీస్ లో భాగంగా నిన్నటి వరకు జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా అదే ఊపును రెండో టెస్టులో కొనసాగించి విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 43 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. 370 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు… కేవలం 327 పరుగులకే ఆల్ అవుట్ అయి ఘోర ఓటమి చవిచూసింది.
Advertisement
డకేట్ 83 పరుగులు కెప్టెన్ బెన్ స్టోక్స్ 150 పరుగులతో పోరాడిన ఇంగ్లాండు జట్టును గెలిపించలేకపోయారు. తాజా విజయంతో ఆస్ట్రేలియా జట్టు 2-0 తేడాతో సిరీస్ లో ముందంజలోకి వచ్చింది. అయితే లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ బేయిర్ స్టో వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు.
Advertisement
బౌలర్ గ్రీన్ వేసిన బంతిని…బేయిర్ స్టో… వదిలేయడంతో కీపర్ క్యారీ అందుకున్నాడు. బాల్ డెడ్ కాకముందే…బేయిర్ స్టో… అవతల ఎండ్ లో ఉన్న స్టాక్స్ వైపు వెళ్లగా ఆస్ట్రేలియా కీపర్ క్యారీ బాల విసరడంతో వికట్లను తాకింది. ఆసీస్ అప్పిల్ చేయడంతో… థర్డ్ ఎంపైర్ దానిని అవుట్ గా ప్రకటించారు. దీంతో బేయిర్ స్టో… పెవిలియన్ కు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
ICC : వరల్డ్ కప్ షెడ్యూల్లో టీమిండియాకు అన్యాయం! ఐసీసీ కావాలనే చేసిందా?