Telugu News » బాహుబ‌లి – 3 ఎప్పుడంటే.. ప్ర‌క‌టన చేసిన జ‌క్క‌న్న

బాహుబ‌లి – 3 ఎప్పుడంటే.. ప్ర‌క‌టన చేసిన జ‌క్క‌న్న

by Bunty

జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లి సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రెండు పార్ట్ ల‌లో తెర‌కెక్కించారు. ఈ సినిమా లతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతి ప్ర‌పంచానికి చాటారు. అంతే కాకుండా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కి ప్ర‌పంచ స్థాయి గుర్తింపు ద‌క్కింది. అలాగే ప్ర‌భాస్ ను పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ ను చేసింది. అయితే బాహుబ‌లికి సిక్వెల్ గా బాహుబ‌లి – 3 తీయాల‌ని తెలుగు సినిమా అభిమానుల‌తో పాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా రాజ‌మౌళి చాలా సార్లు రిక్వ‌స్ట్ చేశారు. కానీ రాజ‌మౌళి బాహుబ‌లి – 3 పై ఎలాంటి అనౌన్స్ చేయ‌లేదు.

Ads

దీంతో బాహుబ‌లి – 3 ఉండ‌ద‌ని అందరూ అనుకున్నారు. అయితే తాజా గా బాహుబ‌లి – 3 పై జ‌క్క‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు కాక‌పోయినా భ‌విష్య‌త్తు లో బాహుబ‌లి – 3 త‌ప్ప‌క ప్లాన్ చేస్తాన‌ని జ‌క్క‌న్న ప్ర‌క‌టించారు. అయితే బాహుబ‌లి – 3 ఎప్పుడు వ‌స్తుందో స్ప‌ష్టం గా చెప్ప‌లేనని అన్నారు. కానీ భ‌విష్య‌త్తు లో త‌ప్ప‌కుండా.. బాహుబ‌లి థ‌ర్డ్ పార్ట్ తీస్తామ‌ని తెలిపారు. అయితే స్వ‌యం గా రాజ‌మౌళి ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం తో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమానులు, తెలుగు సినీ పరిశ్ర‌మ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒక వేళ బాహుబ‌లి – 3 వ‌స్తే మాత్రం మ‌రో సారి ప్ర‌పంచ స్థాయి సినిమా రంగాన్ని షేక్ చేయ‌డం ఖ‌య‌మ‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.


You may also like