గుజరాత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలో భగవద్గీతను ఒక సబ్జెక్ట్ గా బోధించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2022 విద్యా సంవత్సరం నుండి పాఠశాలలో భగవద్గీతను సబ్జెక్టుగా బోధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులకు భారతీయ సంస్కృతి విజ్ఞానాన్ని తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు భగవద్గీతను భోదిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Advertisement
Advertisement
6,7,8 తరగతులకు పుస్తకాల్లో కథ మరియు పారాయణం రూపాల్లో భగవద్గీత చెబుతామని ప్రకటించింది. అదే విధంగా 9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి లాంగ్వేజ్ గా భగవద్గీతను ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. ఇక గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విధంగా అయినా విద్యార్థులకు భగవత్ గీత గురించి తెలుస్తుందని అనుకుంటున్నారు. మరోవైపు బైబిల్ మరియు ఖురాన్ లను కూడా ఇదే విధంగా సిలబస్ లో బోధిస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.