Home » “జై భీమ్” ఆస్కార్ ఆశలు గల్లంతు….!

“జై భీమ్” ఆస్కార్ ఆశలు గల్లంతు….!

by AJAY

సూర్య హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా జై భీమ్. ఈ సినిమాకు టీజీ రత్నవేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సూర్య సతీమణి జ్యోతిక నిర్మించారు. న్యాయవాది జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నటీనటుల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా ఆస్కార్ ఫైనల్ లిస్టులో జై భీమ్ చోటు దక్కించుకోలేకపోయింది. తాజాగా ఆస్కార్ నిర్వాహకులు ప్రకటించిన జాబితాలో లో జై భీమ్ సినిమాకు చోటు దక్కలేదు. ఇక ఆస్కార్ ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకున్న సినిమాల విషయానికి వస్తే డ్రైవ్ మై కార్, ఫ్లీ, ది హ్యాండ్ ఆఫ్ గాడ్, లునానా, ది వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ సినిమాలు ఫైనల్ కు నామినేట్ అయ్యాయి. దాంతో భారతీయుల ఆశలు గల్లంతయ్యాయి. అయినప్పటికీ ఆస్కార్ బరిలో జై భీమ్ నిలవడం గర్వ కారణంగా ప్రేక్షకులు భావిస్తున్నారు.

Visitors Are Also Reading