Home » ఫోన్ ఎక్కువ‌గా వినియోగించే పురుషుల‌కు బ్యాడ్ న్యూస్‌..సంతానంపై ఎఫెక్ట్ ప‌డ‌నుందా..?

ఫోన్ ఎక్కువ‌గా వినియోగించే పురుషుల‌కు బ్యాడ్ న్యూస్‌..సంతానంపై ఎఫెక్ట్ ప‌డ‌నుందా..?

by Anji
Ad

ప్ర‌స్తుత కాలంలో ముఖ్యంగా యువ‌కులు అయితే నిత్యం స్మార్ట్ ఫోన్‌కే అతుక్కుని పోతున్నారు. స్మార్ట్ పోన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా విచ్ఛ‌ల‌విడిగా వాడుతున్నారు. కొంత మంది మంచికి వాడితే.. మ‌రికొంద‌రూ మాత్రం చెడుకు వాడుతున్నారు. ముఖ్యంగా చ‌దువు, జాబ్ కోసం ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. ఎక్కువ‌గా మాత్రం సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూ టైం పాస్ చేస్తూ.. ప‌బ్జీ, ప్రీఫైర్ లాంటి గేమ్స్ వాడుతున్నారు. ఏదైతే అతిగా వాడితే ముప్పు త‌ప్ప‌దు అంటూ తాజాగా స‌ర్వేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి.

Phone Effect : ఫోన్ అతిగే వాడే మగవారికి బ్యాడ్ న్యూస్.. సంతానంపై ఎఫెక్ట్! | The Telugu News

Advertisement

ముఖ్యంగా మ‌గ‌వారు అతిగా స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే భ‌విష్య‌త్‌లో పెను ప్ర‌మాదం త‌ప్ప‌దు అని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో పిల్ల‌లు, వృద్ధులు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిస‌లుగా మారిపోయారు. య‌వ్వ‌నంలో ఉన్న‌వారు మాత్రం అతిగా మొబైల్ వాడితో దాని నుంచి విడుద‌ల‌య్యే రేడియో సీక్వెన్సీ ఎల‌క్ర్టో మాగ్నెటిక్ వేవ్‌ల కార‌ణంగా వీర్యం నాణ్య‌త క్ర‌మక్ర‌మంగా త‌గ్గిపోతుంద‌ని కూడా వెల్ల‌డించారు. ఈ రోజుల‌లో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు.

Advertisement

Social Media and Mental Health - HelpGuide.org

కొంద‌రూ ఉద్యోగానికి సంబంధించిన వ‌ర్క్స్ కూడా మొబైల్ ద్వారానే చేస్తున్నారు. రాత్రి అంతా మేల్కొని ఫోన్ ఉప‌యోగిస్తున్న వారిపై కూడా రేడియేష‌న్ ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంది. ఆ స‌మ‌యంలో మిగ‌తా ఫోన్లు వినియోగం త‌గ్గి ఎక్కువ‌గా రేడియేష‌న్ విడుద‌ల‌వుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. వీర్యంలోని శుక్ర‌క‌ణాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే సంతాన ఉత్ప‌త్తికి ఎలాంటి ముప్పు ఉండ‌దు. లేక‌పోతే సంతానం కోసం ఆసుపత్రుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంద‌ని ద‌క్షిణ‌కొరియా వైద్య నిపుణుల ప‌రిశోధ‌న‌లో తేలింది. యూనివ‌ర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ యున్ హ‌క్ కిమ్ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో మొబైల్ అధికంగా వినియోగించే వారిలో శుక్ర‌క‌ణాల కౌంట్ త‌గ్గింద‌ని పేర్కొన్నారు. వీరితో పోలిస్తే ఫోన్ త‌క్కువ‌గా వినియోగించే వారి శుక్ర‌క‌ణాలు వేగంగా క‌దులుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

Visitors Are Also Reading