తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు సుకుమార్. అలాంటి ఆయన గురించి ఏ విషయం బయటకు వచ్చిన ఫ్యాన్స్ కు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సుకుమార్ భార్య గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.. సుకుమార్ సినిమాలతో దూసుకుపోతూ ఉంటే ఆయన తబీతా సుకుమార్ మాత్రం సరికొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటయ్యా అంటే లాండ్రీ కార్ట్ అనే వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
Advertisement
Also Read:పేషెంట్ తో ప్రేమలో పడ్డ డాక్టర్.. మరణించిన తరువాత కూడా ప్రేమతో..!
అలాంటివారికి ఈ లాండ్రీకార్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రారంభించారట. ఏడాది కాలం పాటు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఈ వ్యాపారాన్ని ప్రారంభించారని తెలుస్తోంది. ఈ వ్యాపారం ఏదో లాభాల కోసం చేసింది కాదని మధ్యతరగతి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ వ్యయంతో సర్వీసులు అందించాలని ప్రారంభించామని సుకుమార్ భార్య తెలియజేశారు. ఈ వ్యాపారం వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుందని తెలియజేశారు.
Advertisement
Also Read:“భైరవద్వీపం” లో బాలయ్య “కురూపి” వేషధారణకి చూపించిన డెడికేషన్ చూస్తే దణ్ణం పెట్టాల్సిందే..!
ఈ వ్యాపారం సమంతతో ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లాండ్రి సర్వీసులలో దుస్తులు ఇస్తే మళ్లీ తీసుకోవడానికి వారం రోజులు పడుతుంది. కానీ వీరి సర్వీస్ కేవలం 48 గంటల్లోనే వినియోగదారులకు వస్తువులను అందజేస్తారట. ప్రస్తుతం 10 శాఖలు విజయవంతంగా సాగుతున్నాయని, డెలివరీ సౌకర్యం కూడా ఉందని తబిత వెల్లడించారు. ఏది ఏమైనా అంత పెద్ద స్టార్ డైరెక్టర్ భార్య ఇలాంటి వ్యాపారం చేయడంపై కొంతమంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read:ప్రతి సినిమాలో కనిపించే ముఖేష్ ఎవరు? అతని స్టోరీ ఏంటి?