Telugu News » బాంబుల మోత‌ మధ్య మెట్రో అండ‌ర్ గ్రౌండ్‌లో ప్ర‌స‌వించిన గ‌ర్భిణి

బాంబుల మోత‌ మధ్య మెట్రో అండ‌ర్ గ్రౌండ్‌లో ప్ర‌స‌వించిన గ‌ర్భిణి

by Anji

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రం దాదాపు ర‌ష్యా బ‌ల‌గాల చేతిల్లోకి వెళ్లిపోయింది. న‌గ‌రం మొత్తం సైనిక దాడులు, బాంబుల దాడి మోత‌, వైమానిక దాడులు మోగుతున్న సైర‌న్ల మ‌ధ్య చిగురాకులా వ‌ణికిపోతుంది. ఈ స‌మ‌యంలో ఇరు దేశాల నేత‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. యుద్ధ తీవ్ర‌త‌ను రోజు రోజుకు పెంచుతున్నారు. ప్ర‌పంచ దేశాల నేత‌లు యుద్ధం త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని కోరుతున్నా ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం త‌గ్గేదే లే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Ads

Also Read :  ఉక్రెయిన్‌లో ర‌ష్యా విధానాన్ని ఖండిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్‌.. భార‌త్ వైఖ‌రి ఏమిటంటే..?

పుతిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తొలుత యుద్ధం ఆపి ఆయుధాలు ప‌క్క‌న పెడితే చ‌ర్చ‌లంటూ ప్ర‌క‌టించిన ర‌ష్యా గంట‌ల వ్య‌వ‌ధిలోనే మాట మార్చేసింది. ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టూ.. ఉక్రెయిన్ యుద్ధం ఆపొద్దు.. ఉక్రెయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వ‌ర‌కు వెన‌క్కి త‌గ్గొద్దంటూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పుతిన్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఈయూ ఆంక్ష‌లు, అమెరికా సైబ‌ర్ దాడులు, నాటో ద‌ళాల కీల‌క స‌మావేశం ఇలా ఎన్ని చేసినా.. ర‌ష్యాకు మాత్రం క‌ళ్లెం వేయ‌లేక‌పోతున్నారు.

ఇలాంటి ఉద్రిక్త వాతావ‌ర‌ణంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు స్థానికులు అండ‌ర్ గ్రౌండ్‌, మెట్రో స్టేష‌న్‌లు, షాపులు, బార్లు, స‌బ్ వే స్టేష‌న్లు షెల్ట‌ర్ హోమ్స్‌గా మారాయి. ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ప్రాణ భ‌యంతో త‌ల‌దాచుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ఓ ఉద్వేగ భ‌రిత ఘ‌ట‌న జ‌రిగింది. బాంబుల మోత, క్షిప‌ణుల హోరు, వైమానిక దాడుల సైరన్ల మోత మ‌ధ్య ఓ గ‌ర్భిణీ ప్ర‌స‌వించింది. పండంటి పాప‌కు జ‌న్మినిచ్చింది. శుక్ర‌వారం రాత్రి అండ‌ర్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్ అండ‌ర్ గ్రౌండ్‌లో త‌ల‌దాచుకున్న ఓ గ‌ర్బిణీ ప్ర‌స‌వ వేద‌న‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో వైద్య సిబ్బంది వ‌చ్చి ఆమెకు స‌హ‌క‌రించారు. ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో ఆ మ‌హిళ పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ చిన్నారి యుద్ధ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టింది. త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్న‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు.

టెటిగ్రామ్ యాప్‌లో కొంద‌రూ షేర్ చేశారు. మెట్రో స్టేష‌న్‌లో బంక‌ర్లుగా వాడుతున్న స్థానికులు ప్ర‌స్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా క‌మ్యూనికేట్ చేసుకుంటున్నారు. భ‌యాన‌క‌, దుర్భ‌ర ప‌రిస్థితుల్లో పుట్టిన ఆశాకిర‌ణం అని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు న‌డుస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌ర‌మైన కీవ్‌లో మెట్రోతో పాటు బాంబు షెల్ట‌ర్‌, మ‌రొక 4500 షెల్ట‌ర్ హోమ్స్ ఉన్నాయి. దాదాపు 50 లక్ష‌ల మంది ఉక్రెనియ‌న్లు విదేశాల‌కు త‌ర‌లివెళ్లే అవ‌కాశాలున్న‌ట్టు ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేస్తోంది.

Also Read :  PKL 2022 : మొద‌టి సారి ఛాంపియ‌న్‌గా ద‌బంగ్ ఢిల్లీ


You may also like