Home » నేను హీరోగా చేస్తుంటే మిగితా హీరోలు అందరూ కలిసి…?

నేను హీరోగా చేస్తుంటే మిగితా హీరోలు అందరూ కలిసి…?

by Azhar
Ad
మన తెలుగు చిత్ర సీమ అందించిన గొప్ప కామెడియన్లలో బాబు మోహన్ కూడా ఒక్కరు. ఈయన అప్పట్లో తెర మీద కనిపిస్తే చాలు నవ్వులే.. నవ్వులు. అంత గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఇక ఈయన కోట శ్రీనివాస రావు గారి కాంబినేషన్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈయన కెమెడియ గా ఉన్న రోజులోనే సుందరవధన సుబ్బలక్ద్మీ అనే సినిమాలో హీరోగా చేసారు. అయితే ఏ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన తాజాగా వివరించారు.
అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన బాబు మోహన్ ను.. మీరు హీరోగా సినిమా చేస్తున్న సమయంలో మీపై చాలా విమర్శలు వచ్చాయి కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ… మన ఇండస్ట్రీలో నన్ను ప్రశ్నించే వారు ఎవరు లేరు. అయితే నేను హీరోగా చేస్తున్నప్పుడు మిగితా హీరోలు అందరూ నా షూటింగ్ దగ్గరకు వచ్చి నన్ను అభినందించారు. హీరోలతో పాటుగా అభిమానులు కూడా చాలా మంది షూటింగ్ జరిగే దగ్గరకు వాసి అభినందనలు తెలిపారు అని అన్నారు.
అదే విధంగా కొంత మంది ప్రొడ్యూసర్లు షూటింగ్ లోకి వచ్చి… మేము మా సినిమాలో చేయాలి అంటూ 14 సినిమాల రెమ్యునరేషన్ నా ముందు ఉంచారు. అలా చేసిన వారిలో గ్రేట్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు కూడా ఒక్కరు. ఒకవేళ నేను సినిమా ఒప్పుకోకపోతే తెచ్చిన ఆ డబ్బును అక్కడే వదిలేసి.. ఎవరికైనా దానం చేయండి అంటూ వెళ్ళిపోయేవారు అని బాబు మోహన్ చెప్పారు. అయితే ఇప్పుడు సినిమాలు మొత్తం తగ్గించిన బాబు మోహన్ గారు రాజకియ్యాలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.

Advertisement

Visitors Are Also Reading