దేశ వ్యాప్తంగా కొట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఇవాళ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కి సంబంధించి పలువురు రాజకీయ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ఓ క్రమ పద్ధతిలో తీసుకున్నారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే నేడు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవింద్ వల్లభ్ పంత్ ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఓవైసీ ఆరోపించారు. అదే సమయంలో అయోధ్య జిల్లాకు కలెక్టర్‌గా నాయర్ ఉండేవారని.. ఆయన బాబ్రీ మసీదును మూసివేసి, అక్కడ పూజలు చేయడం ప్రారంభించారంటూ ఓవైసీ చెప్పుకొచ్చారు. విశ్వ హిందూ పరిషత్ పుట్టినప్ప్పుడు రామమందిరం లేదని తెలిపారు ఓవైసీ.
అయోధ్య రామాలయం గురించి మహాత్మాగాంధీ ఎప్పుడూ ఏమీ ప్రస్తావించలేదన్నారు. చాలా క్రమపద్ధతిలో భారతీయ ముస్లింల నుంచి బాబ్రీని లక్కున్నారని ఓవైసీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా ఆప్ మెజారిటీ వర్గాలను సంతోష పెట్టే పనిలో నిమగ్నమయ్యాయని ఆయన అన్నారు. అయితే ఇదే సమంయలో మైనారిటీల గురించి మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.