Home » ఎలా ఆడాలో పాకిస్థాన్ కు కోహ్లీ నేర్పించాడు..!

ఎలా ఆడాలో పాకిస్థాన్ కు కోహ్లీ నేర్పించాడు..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ మజానే వేరు అని చెప్పాలి. రెండు దేశాల మధ్య విబేధాల కారణంగా ఈ రెండు జట్లు అనేవి పోటీ పడుతుంటే.. దానిని ఓ యుద్ధం అని రెండు దేశాల ఫ్యాన్స్ భావిస్తారు. అలాగే ఈ మ్యాచ్ ప్రాముఖ్యతను చెప్పాలి అంటే కేవలం 10 నిమిషాల్లో అమ్ముడయ్యే లక్షకు పైగా టికెట్లు నిదర్శనం.

Advertisement

అయితే ఈ రోజు కూడా ఇండియా, పాక్ జట్లు అనేవి ప్రపంచ కప్ లో పోటీ పడ్డాయి. మెల్బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ కు 90 వేళా మంది అభిమానులు హాజరయ్యారు. ఇక అంత మంది మధ్యలో ఆడటం అంటే అది చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. ఇక ఆ మ్యాచ్ లో మన జట్టు కేవలం 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోతే అక్కడ ఉన్న ఆటగాళ్ల పైన అది ఇంకా పెరుగుతుంది.

Advertisement

ఇక ఈరోజు విరాట్ కోహ్లీ పరిస్థితి అలాంటిదే. కానీ అందులో కూడా విరాట్ ఎలా ఆడాలి అనేది ఇండియాను గెలిపించి అందరికి చూపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ… కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు. ఒత్తిడిలో ఎలా బ్యాటింగ్ చెయ్యాలి అనేది ఈరోజు విరాట్ కోహ్లీ మాకు అందరికి చేసి చూపించాడు అని బాబర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ దుమ్ము దులిపి రికార్డు క్రియేట్ చేసిన విరాట్..!

ఇండియా చీటింగ్ చేసిందా..?

Visitors Are Also Reading