ఉత్తరప్రదేశ్లో అయోధ్య నగరం ఎక్కడ చూసినా రామ నామస్మరణతోనే కనబడుతోంది. రామ మందిరం గ్రాండ్ ఓపెనింగ్ కోసం ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఈ ఫోటోలు కూడా ఇప్పటికే రామ మందిరం ట్రస్టు రిలీజ్ చేసింది. ఇంకో పక్క రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం నాటికి ఆరవ రోజుకి చేరుకుంది. 114 కలశాల నీటిని ఉపయోగించి రాంలల్ల విగ్రహానికి ఉత్సవ స్నానం చేయించబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:20కి జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Advertisement
Advertisement
జనవరి 23 నుండి రామ మందిరానికి సాధారణ ప్రజలని అనుమతించనున్నారు ఉత్తరప్రదేశ్ డిజిపి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 25 వేలు మందికి పైగా యుపి పోలీసుల్ని మోహరించారు. సుమారు రెండు వేలకు క్వింటాళ్ల పూలతో అయోధ్య నగరాన్ని అలంకరించడం జరిగింది. అంతేకాకుండా అయోధ్య నగరం అంతా రాముడి కటౌట్లతో ఏర్పాటు చేశారు భారత్ లోని సుమారు 7000 మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!