Home » అయోధ్య రామమందిరం గంటలో వున్న ప్రత్యేకత తెలుసా..?

అయోధ్య రామమందిరం గంటలో వున్న ప్రత్యేకత తెలుసా..?

by Sravya
Ad

వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత రామ మందిరం పూర్తవుబోతోంది. రాముడు నివాసం ఉండబోతున్నాడు. జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లాల ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే దీనికోసం భక్తుల్లో ఉత్సాహం ఎక్కువైంది. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నిర్మిస్తున్న ఆలయం ఇది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి కూడా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. రామ మందిరాన్ని గ్రాండ్ గా మొదలు పెట్టడానికి ఉపయోగించే ప్రతి విషయం కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

Advertisement

Advertisement

ఇప్పుడు అందరూ గంట గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ గంట ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం. ఈ రామాలయానికి ప్రత్యేకమైన గంటని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ గంట శబ్దం 10 కిలోమీటర్ల దాకా వినబడుతుంది దీని యొక్క వెడల్పు 3.9 అడుగులు. దీని పొడవు నాలుగు అడుగులు. ఈ గంటని ఒక్కసారి మోగిస్తే ఓం అనే శబ్దం వినపడుతుంది. 613 కిలోల బరువు ఇది. ఈ ప్రత్యేక గంటని తమిళనాడులోని రామేశ్వరం నుండి రామాలయానికి పంపించారు. తమిళనాడులో రామేశ్వరం నుండి 4500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ భారీ గంటని అయోధ్యకు తీసుకెళ్లారు. ఈ గంట మీద రాముడి పేరు రాయబడింది. అష్టధాతువు నుండి తయారు చేయబడింది. ఈ గంటను తయారు చేయడానికి 400 మంది పాల్గొన్నారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading