నిన్న టీమిండియా మరియు శ్రీలంక జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో… కొత్త ఏడాదిలో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. శ్రీలంకతో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ పోరాడి 16 పరుగులతో ఓటమిపాలైంది. అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ ల పోరాటం వృధా అయ్యింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్నిత 20 ఓవర్లలో ఆరు వికెట్లను 206 పరుగులు చేసింది.
Advertisement
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలో టీమిండియా టాప్ 3 వికెట్లను కోల్పోయింది. అయితే, రెండో టీ20లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. మ్యాచ్ ఓడినా కూడా అతని ఇన్నింగ్స్ చూసిన భారత అభిమానులు శభాష్ అంటూ మెచ్చుకున్నారు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా ఏడో స్థానంలో బరిలోకి దిగిన అతను కేవలం 31 బంతుల్లోనే 65 పరుగులు సాధించి జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. ఈ క్రమంలో అతను కొన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టాడు.
Advertisement
ఈ మ్యాచ్ లో కేవలం 31 బంతులే ఎదుర్కొన్న అక్షర్ పటేల్ ఏకంగా 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టి20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అంతేకాదు భారత్ తరపున ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ గా కూడా నిలిచాడు. ఇంతకుముందు వరకు ఈ రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. తన సూపర్ ఇన్నింగ్స్ లో అక్షర్ 6 భారీ సిక్సర్లు బాదాడు. శ్రీలంక స్పిన్నర్ లపై ఎదురుదాడికి దిగిన అతను ఎడాపెడా సిక్సర్లు బాదేశాడు. ముఖ్యంగా హసరంగా వేసిన 14వ ఓవర్లో అయితే వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. ఇలా ఏడు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి భారత్ తరపున ఒక టి20 మ్యాచ్ లో ఇన్ని సిక్సర్లు మరే బ్యాటరు కొట్టలేదు.
READ ALSO : పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !