Home » అవతార్ సినిమాలో ఆ సీన్ గ‌మ‌నించారా..? జేమ్స్ మావ మన సినిమా నుండే లేపేశాడుగా..!

అవతార్ సినిమాలో ఆ సీన్ గ‌మ‌నించారా..? జేమ్స్ మావ మన సినిమా నుండే లేపేశాడుగా..!

by AJAY
Ad

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది. ఏం చేసినా నెటిజ‌న్ లు ప‌ట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల్లో చిన్న మిస్టేట్ లు క‌నిపించినా లాజిక్ లు మిస్ అయినా కూడా వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా ఏదైనా సీన్ లేదా మ్యూజిక్ కాపీ కొట్టిన‌ట్టు ఉంటే చాలు ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ఏ సినిమా అయినా ట్రోల‌ర్స్ కు దొరికిపోతే అంతే సంగ‌తి.

ALSO READ : ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు మార‌లేదు..ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాల‌య్య బాబు సూటి ప్ర‌శ్న‌..!

Advertisement

ఇక ప్రస్తుతం అవ‌తార్ సినిమాను సైతం ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా అవ‌తార్ సినిమా పార్ట్ 2 విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ పేరుతో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పార్ట్ 1 పండోరా గ్ర‌హం పై ఉండ‌గా అవ‌తార్ పార్ట్ 2 పూర్తిగా వాట‌ర్ లో ఉంటుంది. ఈ సినిమా త్రిడీలో విడుద‌లై ప్రేక్ష‌కుల నుండి ప్ర‌శంస‌లు అందుకుంది.

avatar 2 movie review in telugu

avatar 2 movie 

అయితే ఈ సినిమా లో స‌ముద్రంలో అవ‌తార్ ల‌కు మ‌నుషుల‌కు మ‌ధ్య ఫైట్ జ‌రిగేట‌ప్పుడు ఓ మ్యూజిక్ వినిపిస్తుంది. స‌ముద్రంలో వ‌చ్చే మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే అచ్చం అలాంటి మ్యూజిక్ కేజీఎఫ్ సినిమాలో క‌నిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాలో హీరో స‌ముంద్రంలో బోట్ లో వెలుతున్నప్పుడు ఆ మ్యూజిక్ వినిపిస్తుంది.

దాంతో అవ‌తార్ సినిమా మ్యూజిక్ ను కేజీఎఫ్ నుండి కాపీ కొట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మ‌రోవైపు ఆ మ్యూజిక్ అస‌లు అవ‌తార్ పార్ట్ 1లో కూడా ఉంద‌ని ఆ సినిమా నుండి కేజీఎఫ్ లో కాపీ కొట్టారు అని కొంత‌మంది నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక అదే మ్యూజిక్ అవ‌తార్ పార్ట్ 2లో ఉండ‌టం వ‌ల్ల‌నే ట్రోల్ చేస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading