జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2009లో విడుదల చేశారు. కాగా పదేళ్ల క్రితం అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే జేమ్స్ కెమెరూన్ విజువల్ వండర్ ను చూపించాడు. అయితే ఇప్పుడు అవతార్ 2 సినిమాను కెమెరూన్ పూర్తిచేశారు.
Advertisement
అవతార్ సినిమా పూర్తిగా పండోరా గ్రహంలో జరగగా అవతార్ 2 పూర్తిగా నీటిలో జరగనుంది. ఈ సినిమా కోసం దర్శకుడు సముద్రం అంతర్బాగంలోకి వెళ్లి మరీ ప్రయోగాలు చేశాడు. అంతే కాకుండా ఈ సినిమా ఎక్కువ భాగాన్ని కూడా నీటిలోనే చిత్రీకరణ జరిపారు. షూటింగ్ కోసం కొన్ని టన్నుల నీరు పట్టే ట్యాంకర్ ను సిద్దం చేసి అందులో షూటింగ్ చేశారు.
Advertisement
ఇక ఇప్పటికే అవతార్ 2 సినిమా ట్రైలర్ విడుదల చేయగా నెటిజన్లు ఫిదా అయ్యారు. విజువల్స్ చూసి సినిమా కచ్చితంగా థియేటర్ లో చూడాలని ఫిక్స్ అయ్యారు. సినిమాను డిసెంబర్ 16న విడుదల చేస్తున్నారు. అయితే విడుదలకు ఒకరోజు ముందు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. సినిమా ప్రింట్ ను పైరసీ చేసి నెట్ లోకి వదిలారు.
Advertisement
అవతార్ 2 లింక్ ను టెలిగ్రామ్ లో ఫైరసీ చేసి అందుబాటులో ఉంచారు. దాంతో చాలా మంది సినిమాను చూస్తున్నారు. కాగా కొంతమంది నెటిజన్లు అవతార్ అనేది విజువల్ వండర్ అని అలాంటి సినిమాను పైరసీ చేశారంటూ ఫైర్ అవుతున్నారు. ఆ సినిమాను థియేటర్ లో చూస్తేనే కిక్ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.