Home » మోడీ కోసం కిచిడి వండిన ఆస్ట్రేలియా ప్రధాని..!

మోడీ కోసం కిచిడి వండిన ఆస్ట్రేలియా ప్రధాని..!

by Anji
Ad

భారత్ ఆస్ట్రేలియాల మధ్య దశాబ్దాలుగా మంచి స్నేహ సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే ఏళ్ల క్రితమే భారతీయులు ఉపాధి కోసం అక్కడికి వెళ్లారు ఇంకా వెళ్తూనే ఉన్నారు కూడా.ఇక క్వాడ్ కూటమిలో భారత్ ఆస్ట్రేలియాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఆ దేశ ప్రధాని మోరిసన్ మన ప్రధాని నరేంద్ర మోడీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఈ నేపథ్యంలోనే మోడీ కి ఎంతో ఇష్టమైన కిచిడి బండి ఆఫ్ ఫోటోను షేర్ చేశారు మోరిసన్ ఇటీవల భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందంను పురస్కరించుకొని ఈ కిచిడి ని తయారు చేశారు.


ఆస్ట్రేలియాలో కర్రీ నైట్గా జరుపుకునే రాత్రి విందు ను పురస్కరించుకుని మోడీ స్వస్థలమైన గుజరాత్ లో ప్రజలు ఇష్టంగా తినే కిచిడీ ని తన నివాసంలో వండి నట్టు మోరిసన్ తెలిపారు. ఈ మేరకు తాము వండిన వంటకాలు ఫోటోలను ఇంస్టాల్ లో పెట్టారు ఆస్ట్రేలియా ప్రధాని ఈ ఏడాది ఏప్రిల్ భారత్ ఆస్ట్రేలియా లో ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందం పై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement


వాణిజ్య ఒప్పందం పై పీయూష్ గోయల్ ఆస్ట్రేలియా వాణిజ్యం పర్యాటకం పెట్టుబడి శాఖల మంత్రి డాన్ సంతకాలు చేశారు ఒక అభివృద్ధి చెందిన దేశంతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం దశాబ్ద కాలం తర్వాత ఇదే తొలిసారి ఆస్ట్రేలియా భారత్కు 17వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అలాగే మన దేశం ఆస్ట్రేలియాకు 9వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి 2021లో ఇరు దేశాల మధ్య 27 5 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 45 నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఈ వాణిజ్య ఒప్పందం కొత్త ఉపాధి అవకాశాలను స్పష్టిస్తుందని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ప్రధాని మోడీ తనకిష్టమైన కిచిడి గురించి పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

Visitors Are Also Reading