విజయనగరం జిల్లా వంగర నుంచి ఎత్తుకెళ్ళిన నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్ ఆచూకీ లభ్యం అయ్యింది. రేగిడి మండలం మీసాలడోలపేట గ్రామ సమీపంలో బస్సును దుండగులు విడిచివెళ్ళిపోయారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఢిల్లీ రెడ్ పోర్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్ జోన్ అమలు.. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగర వేయడంపై నిషేధం విధించారు. 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పదివేల మంది పోలీసుల మోహరింపు… గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను నియమించారు.
కాసేపట్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని AICC పిలుపును ఇచ్చింది. దాంతో ఈ రోజు నుంచి ఆగస్ట్ 15 వరకు జగ్గారెడ్డి పాదయాత్ర కొనసాగనుంది.
అల్లూరి జిల్లా AOBలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగి పొర్లతున్నాయి. దాంతో పెదబయలు, ముంచంగిపుట్టు,జి. మాడుగుల మండలాలపై ఎఫెక్ట్ పడింది. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శబరి నది సైతం ప్రమాదకరం గా మారింది.
Advertisement
బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల…ఉత్తర తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు కురుస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో రాంకీరెడ్డి, చిరాగ్‌శెట్టి స్వర్ణం అందుకున్నారు. దాంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 22వ స్వర్ణం వచ్చింది.
పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల సవాల్ విసిరారు. పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. ఉప ఎన్నికకు రావాలంటే దమ్ముండాలి. రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే 5 నిమిషాల్లో ఆమోదించారు అంటూ సవాల్ చేశారు.
బీహార్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇవాళ జేడీయూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీతో తెగదెంపులకు నితీష్ సిద్దం అయ్యారు. మరోపక్క ఆర్జేడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే నితీష్ సోనియా అపాయింట్మెంట్ తీసుకున్నారు.