నేడు 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు… ఫలితాల ప్రకటన చేయనున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్ధి జగదీష్ ధన్ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా పోటీ పడుతున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ రెజ్లింగ్లో భారత్కు వరుసగా 6 పతకాలు వచ్చాయి. రెజ్లింగ్లో భారత్కు 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్య పతకాలు వచ్చాయి. ఇప్పటి వరకు 9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్య పతకాలతో భారత్ ఐదో స్థానం లో నిలిచింది.
Advertisement
నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నాల్గో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు ఫ్లోరిడాలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
రెండు రోజుల పాటు ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
Advertisement
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి దాసోజు శ్రవణ్ రాజీనామా లేఖ రాశారు.
నాలుగు రోజులపాటు ఈడి అధికారులు చికోటి ప్రవీణ్ ను విచారించారు. చికోటి వాట్సాప్ చాటింగ్ లో బయటపడ్డ రాజకీయ నేతల లింకులు బయటపడ్డాయి. సోమవారం నుంచి రాజకీయ నేతలు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
నేడు శ్రీకాకుళం జిల్లలో సీఎం జగన్ పర్యటించనున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కొడుకు వివాహ వేడుకకు హాజరు కానున్నారు.
సాధారణ ప్రసవాలు ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవాలు చేసిన వైద్యబృందానికి రూ.3వేల ఇన్సెంటివ్ ఇస్తామని తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.