Home » Aug 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఏపీలో ఆగస్ట్ 6 నుండి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అభ్యర్థులు పరీక్షకు గంట ముందే చేరుకోవాలని ఆదేశించింది.

ఆరు రూపాయలతో కొన్న లాటరీ టికెట్ అతడి జీవితాన్ని మార్చేసింది. పంజాబ్ లోని లూథియానకు చెందిన కుల్దీప్ సింగ్ 6 రూపాయలతో లాటరీ టికెట్ కొనగా అతడికి కోటి రూపాయలు బహుమతిగా వచ్చింది.

Advertisement

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

modi

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోల పాటు భారీ వర్షాలు కురుస్తాయని… ఏపీలో 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 17 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ఆర్గాన్స్ తరలింపులో కీలకంగా వ్యవహరించారు. మలక్ పేట యశోద నుంచి సికింద్రాబాద్ కిమ్స్ కు 11కిలోమీటర్ల దూరాన్ని 13నిమిషాల్లో లంగ్స్ తో అంబులెన్స్ చేరుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 23సార్లు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి అవయవాలు తరలించారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో 20 పతకాలు చేరాయి. వాటిలో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.

రేపు కాంగ్రెస్ పార్టీలో చెరుకు సుధాకర్ చేరుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు.

ఈ నెల 12న హైదరాబాద్ కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి తరుణ్ చుగ్ రానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక యాక్షన్ ప్లాన్ ను తరుణ్ చుగ్ వివరించనున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరికలు. సైతం జరగనున్నాయి.

Visitors Are Also Reading