భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 64,667 ఆఆ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా దోమ (మం) ఊటుపల్లిలో గ్రామస్థులు యువకుడిని నిర్బందించారు. యువకుడ్ని ఆలయంలో నిర్బంధించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మధుకర్ అనే యువకుడు మోసం చేయడం తో గ్రామంలో అలా చేశారు.
Advertisement
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రైవేటు బస్సుల దందా జోరుగా కనిపిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ప్రైవేట్ బస్సులు వెళ్తున్నాయి. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. ప్రైవేట్ వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం కలుగుతోంది.
ప్రకాశం జిల్లా కనిగిరి (మం) చల్లగిరలలో వివాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాన్ని పక్కకు జరిపే విషయంలో ఘర్షణ మొదలయ్యింది. పెద్దన్న అనే వ్యక్తిపై కత్తితో యువకుడు దాడి చేశాడు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు.
ఖైరతాబాద్‌లో మహా గణపతి కొలువుదీరాడు. కాసేపట్లో ఖైరతాబాద్ గణపతికి తొలిపూజ చేయనున్నారు. ఖైరతాబాద్‌లో తొలిసారిగా 50 అడుగుల మట్టివిగ్రహం ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
Advertisement
చిత్తూరు జిల్లా గంగవరం (మం) సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సీఎం కేసీఆర్ నేడు బీహార్‌కు వెళ్లనున్నారు. గాల్వాన్ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. మధ్యాహ్నం బీహార్ సీఎం నితీష్‌తో కేసీఆర్ లంచ్ మీట్ ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,250 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,540 గా ఉంది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. భారీగా కావేరి నది వరద ప్రవాహం కనిపిస్తోంది. డెల్టా ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
మరో 2,910 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 52 వేల 460 ఉద్యోగాల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.