రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ఇబ్రహీంపట్నంలో వరుసగా 3 రోజుల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈనెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. దాంతో న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆందోళన కు దిగాయి.
సీఎం ఇంటి ముట్టడికి సీపీఎస్ ఉద్యోగులు బయలుదేరారు. నోటీసులు ఉల్లంఘించిన వారిని పోలీసులు బైండోవర్ చేసుకున్నారు. ఉపాధ్యాయులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Advertisement
నేడు ఉదయం 9.30 గంటలకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఇంటర్ అఫిషియల్ వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
ఆసియాకప్లో నేడు బంగ్లాదేశ్తో ఆప్ఘనిస్థాన్ పోటీ పడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Advertisement
హైదరాబాద్ మహేష్ బ్యాంకు కేస్ లో మరో ట్విస్ట్ బయటపడింది. ఛైర్మన్ తో పాటుగా డైరెక్టర్లకు 15 రోజులు జైలు శిక్ష పడింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘంచినందుకు జైల్ శిక్ష విధించారు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ బంజ్ తో పాటు పదిమంది డైరెక్టర్లకు జైలు శిక్ష ఖరారు అయ్యింది.
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ఖరారు అయ్యింది. బుధవారం ఉదయం కేసీఆర్ హైదరాబాద్ నుంచి పాట్నాకు వెళ్లనున్నారు.
ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో అదాని గ్రూప్ మూడో స్థానానికి చేరింది. గౌతమ్ అదానీ 137 బిలియన్ డాలర్ల నిఖర విలువతో మూడో స్థానం లో నిలిచారు.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 5,439 కొత్త కేసులు నమోదయ్యాయి.
బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల కిందట చేసిన వివాదాస్పద ట్వీట్ నేపథ్యంలో లో కమల్ అరెస్ట్ అయ్యారు.