Home » Aug 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా భైంసాలో బంద్ కు పిలుపునిచ్చారు. మరో వైపు చార్మినార్ ప్రాంతం లో కూడా హై అలెర్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో మునావర్ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. రేపు ఢిల్లీలో షోకు మునావర్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు షో ను రద్దు చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ యూయూ లలిత్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

నేటి నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు శ్రీలంక – ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ తో ప్రారంభం కానుంది.

దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ పూర్తి అయ్యింది. నేడు సీఎం స్టాలిన్‌కు రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి నివేదిక ఇవ్వనున్నారు.

కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌లు జరుగుతున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసిన వెంటనే అరెస్టులు మొదలయ్యాయి. శాంతిపురం మండలంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మణి, కుప్పం మున్సిపాలిటీలో జాకీర్‌ అరెస్ట్‌ అయ్యారు. చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న 60 మందిపై కేసులు నమోదయ్యాయి.

టాలీవుడ్‌పై బీజేపీ దృష్టి పెట్టింది. నేడు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ సమావేశం కానున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హీరో నితిన్‌ భేటీ కానున్నారు. జేపీ నడ్డాను కొందరు రచయితలు, స్పోర్ట్స్‌ పర్సన్స్‌ కలవనున్నారు.

రేపు వరంగల్‌లో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఇవాళ వరంగల్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ వస్తున్నారు.

Visitors Are Also Reading