ఇవాళ హైకోర్టులో రాజధాని అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని విషయంలో ప్రభుత్వంపై రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ జరగనుంది.
Advertisement
టంగుటూరి ప్రకాశం పంతులు 151జయంతి వేళ అసెంబ్లీ ముందు ఆయన విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాల్లు అర్పించారు. ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శం..ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో ఆయనని స్మరించుకోవడం మనందరి అదృష్టం అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి ఏర్పడింది. సాధారణ స్థాయికి గోదావరి వరద ప్రవాహం చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7, 5 అడుగులకు నీటిమట్టం తగ్గినట్టు తెలుస్తోంది. బ్యారేజీ నుండి 4 లక్షల 50వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు.
నేడు కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలతో పాటు జల విద్యుదుత్పత్తి, వరద జలాల అంశాలపై చర్చ జరగనుంది. 2022-23లో సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొనబోతుంది.
Advertisement
విశాఖలో వర్షాకాలంలో భానుడి ప్రతాపం కనిపిస్తోంది. 2-3డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశ్చిమ గాలులు, గాలిలో తేమ పెరగడమే దీనికి ప్రధాన కారణం అయ్యింది. దాంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఎండ తీవ్రత కొనసాగటం తో విద్యుత్ వినియోగం పెరిగింది.
తిరుమలలో 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.
తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు. ఎవరైనా నన్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు, మీరు కలిసి పని చేస్తే మీకే లాభమని అన్నారు.
ఆసియా కప్ టోర్నీ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. టోర్నీ కి ముందు కరోనా రావడం తో ఆందోళన నెలకొంది.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల బిజెపి కార్యకర్తల పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని సంజయ్ నిరసన కు దిగారు. దాంతో పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు.