కర్నూలులో హనీట్రాప్ కలకలం రేపింది. చాటింగ్, వీడియో కాల్స్‌తో యువకులకు యువతి వల విసిరింది. భారీగా నగదు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడటంతో పాటూ అత్యాచారయత్నం కేసులు పెడతానంటూ యువతి బెదిరింపులకు పాల్పడింది.
నేడు మునుగోడులో బీజేపీ సమరభేరి సభను నిర్వహించారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరనున్నారు. కేసీఆర్ ఆరోపణలకు అమిత్‌షా ఎలా కౌంటర్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. నిన్న 79,836 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవాళ మునుగోడులో బీజేపీ సమరభేరి సభ నిర్వహిస్తున్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ఆరోపణలకు అమిత్‌షా ఎలా కౌంటర్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ. నిన్న మోడీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు లుకౌట్ నోటీసు జారీ చేశారు.
Advertisement
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు పడతాయనుకుంటున్నావా? కృష్ణా జలాల వాటా రాకపోవడానికి ముమ్మాటికీ నువ్వే బాధ్యుడివి..నరేంద్ర మోదీ, అమిత్ షా గురించి నోరు జారితే ఖబడ్దార్ అంటూ కేసీఆర్ పై బండి ఫైర్ అయ్యారు.
టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 24వ తేదీ నుండి కుప్పం లో పర్యటించనున్నారు. 24,25,26 తేదీల్లో చంద్రబాబు కుప్పం లో పర్యటిస్తారు.
పెళ్లి ముహూర్తాలకు ఈరోజే చివరి రోజు కానుంది. మళ్ళీ డిసెంబర్ వరకూ ఈ ఏడాదిలో పెళ్లి ముహూర్తాలు లేవు.
మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్థి కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, చల్లా కృష్ణా రెడ్డి సహా పలువురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు.
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,800 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,150 గా ఉంది.