Home » Aug 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,94,052 క్యూసెక్కులు,; ఔట్ ఫ్లో 4,38,762 క్యూసెక్కులు గా ఉంది.

Advertisement

బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

హైదరాబాద్‌ కుషాయిగూడలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు పేలడం కలకలం రేపుతోంది. ఛార్జింగ్‌ పెడుతుండగా బైక్‌లు దగ్దం అయ్యాయి.

ఈ నెల 21న మునుగోడు లో అమిత్‌షా ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. తన రాజీనామాతో ఆగమేఘాలపై మునుగోడులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీకి అమ్ముడుపోయానన్న ఆరోపణలపై జగదీష్‌రెడ్డి ఆధారాలు చూపాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు.

Advertisement

కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం (35) గుండె పోటుతో మరణించారు.

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూల్స్ లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు పొందేందుకు ఏపీ విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

దేశం లోని 13 బంగారు గనులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ ఘనులు ఏపీ, యుపి రాష్ట్రాల్లో ఉన్నాయి.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పై పోరాడేందుకు మెడర్నా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురాగా యుకే ఆ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది.

నేడు మెట్రో సేవలకు స్వల్ప విరామం ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనుంది.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి ముర్ము , ప్రధాని మోడీ నివాళి అర్పించారు.

Visitors Are Also Reading