Telugu News » Blog » Aug 11th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 11th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

జమ్మూకాశ్మీర్‌ రాజౌరిలో ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా మట్టు పెట్టాయి. రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

Ads

భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 51.50 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం జరగనుంది. కేబినెట్‌ ముందుకు వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా బిల్లు, అన్ని వర్సిటీలకు కామన్‌ రిక్రూట్‌మెంట్‌కు అనుకూలంగా చట్ట సవరణ చేయనున్నారు. ఇప్పటికే సర్కార్ కామన్‌ బోర్డు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా విడుదల చేసింది. ఏపీకి రూ.4,721 కోట్లు, తెలంగాణకు రూ.2,452 కోట్లను కేంద్రం విడుదల చేసింది. అత్యధికంగా యూపీకి నిధులు కేటాయించింది. యూపీకి రూ.20,928 కోట్లను విడుదల చేసింది.

Ads

నేడు ఉ.10:30 గంటలకు మునుగోడుపై కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో నేతలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అనుబంధ సంఘాల ఛైర్మన్‌లతో సమావేశం కానున్నారు.

తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా తరుణ్ చుగ్ స్థానంలో సునీల్ బన్సాల్ ను నియమించారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా బీజేపీ ఇంఛార్జ్‌గా సునీల్ బన్సాల్‌కు బాధ్యతలు అప్పగించారు.

సుప్రీంకోర్టు 49వ చీఫ్ జస్టిస్‌గా యు.యు.లలిత్ నియామకం అయ్యారు. సీజేఐగా లలిత్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖరారు చేశారు. తదుపరి సీజేఐగా లలిత్‌ను జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈనెల 26తో ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం ముగియనుంది.

Ap cm jagan

Ap cm jagan

జగనన్న విద్యాదీవెన పథకం కింద డబ్బులు పంపిణీ చేసేందుకు సీఎం జగన్ నేడు బాపట్ల లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్కూల్స్ కు సెలవు ప్రకటించారు.

స్కూల్స్ విలీనం పై విమర్శలు అభ్యంతరాలు వస్తున్న నేపథ్యం లో మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.