భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12 గంటలుగా నిలకడ గోదావరి నిలకడగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దాంతో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పట్టనుంది. నిన్న 63,754 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.63 కోట్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుభకార్యాల కారణంగా ఈనెల 21న తలపెట్టిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను కేబినెట్ రద్దు చేసింది.
Advertisement
బీజేపీ నేత తరుణ్ చుగ్ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన పార్టీ చేరికల కమిటీతో భేటీ కానున్నారు. పల్లెగోస బీజేపీ భరోసాపై తరుణ్ చుగ్ సమీక్షించనున్నారు.
మునుగోడు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని 15 రోజుల్లో ఖరారు చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ కమిటీని వేసింది.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం పెరిగింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా రిశబ్ పంత్ ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం రిషబ్ పంత్ ను సన్మానించి అభినందించారు.
ప్రముఖ సింగర్ నేషనల్ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న గుండెపోటు తో మరణించారు. ఆయన కన్నడ నాట గాయకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు.