Home » “అత్తారింటికి దారేది” సినిమాలోని ఈ సీన్ ఎక్క‌డ నుండి లేపేశారో తెలుసా..?

“అత్తారింటికి దారేది” సినిమాలోని ఈ సీన్ ఎక్క‌డ నుండి లేపేశారో తెలుసా..?

by AJAY
Ad

సాధార‌ణంగా ద‌ర్శ‌కులు హాలీవుడ్ సినిమాలు కొరియ‌న్ సినిమాలు ఇలా ఏదో ఇండ‌స్ట్రీ నుండి సినిమాల‌ను ఆద‌ర్శంగా తీసుకుని కొత్త సినిమాలు తెర‌కెక్కించడం కామ‌న్. కానీ కొన్ని సార్లు మాత్రం తెలుగు సినిమాల‌లోని సీన్ల‌నే కాపీ కొట్టి దొరికిపోతుంటారు. అయితే ఆ సినిమా నుండి కాపీ కొట్టారా లేదా అన్న విష‌యం ప‌క్క‌న పెడితే సీన్లు మాత్రం మ‌క్కికి మ‌క్కి దించేసినట్టుగా క‌నిపిస్తుంటాయి.

Advertisement

ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్తారింటికి దారేది సినిమా గురించి కూడా అలాంటి ట్రోల్సే వ‌స్తున్నాయి. నిజానికి అత్తారింటికి దారేది సినిమా త్రివిక్ర‌మ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా గబ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత మ‌ళ్లీ అత్తారింటికి దారేది సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డింది. ఈ సినిమాలోని మాట‌లు యాక్ష‌న్ కామెడి ఇలా అన్ని ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ హిట్ సింహాద్రిలోని ఓ సీన్ నుండి లేపేశార‌ని ట్రోల్స్ వ‌స్తున్నాయి. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సోద‌రి ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇక అక్క‌డ హీరోయిన్ కు మామ‌గా ఎన్టీఆర్ వాళ్ల ఇంటికి వెళ‌తాడు. ఓ సంధ‌ర్బంలో హీరోయిన్ ను లేచిపోదామా అంటూ అగ‌డ్డా వెన‌క‌నే ఉన్న హీరోయిన్ తండ్రి ఎన్టీఆర్ ను చెంప‌పై లాగి కొడ‌తాడు.

అప్పుడు ఎన్టీఆర్ మీ కూతుర్ని లేచిపోదామా అని అడిగితేనే మీకు కోపంగా ఉంటే…మీరు 20 ఏళ్ల క్రితం చేసింది ఏంది. మిమ్మ‌ల్ని కొట్ట‌డం ఎలా త‌ప్పు అవుతుంది అంటూ నిల‌దీస్తాడు. ఇక అచ్చం ఇలాంటి సీన్ అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ లో క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాదిరిగానే ప‌వ‌న్ డైలాగ్ కూడా ఉంటుంది. అయితే అత్తారింటికి దారేది సినిమా క‌థ‌ మొత్తం కూడా అత్త‌ను ఇంటికి తీసుకెళ్ల‌డం చుట్టే తిరుగుతుంది. ఇక అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెద్ద‌గా లేదు కాబ‌ట్టి దీన్నిఎవ‌రూ గుర్తించ‌లేదు. ఇప్పుడు ఆ రెండు సినిమాల్లోని సీన్ల‌ను కంపేర్ చేస్తూ త్రివిక్ర‌మ్ సింహాద్రి సీన్ తో సినిమా తీశాడుగా అంటూ కౌంట‌ర్ లు వేస్తున్నారు.

ALSO READ : చైతూ త‌ల్లి ద‌గ్గుబాటి ల‌క్ష్మి గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు..? నాగార్జునతో ఎందుకు విడిపోయారంటే..!

Visitors Are Also Reading