Telugu News » Blog » అద‌ర‌గొడుతున్న మాస్ ఖిలాడీ సాంగ్‌…

అద‌ర‌గొడుతున్న మాస్ ఖిలాడీ సాంగ్‌…

by Bunty

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ హీరోగా చేస్తున్న మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఖిలాడీ. ఈ సినిమా షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటోంది. ఏ స్టూడియోస్‌పై ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ది. సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఖిలాడీ పేరుతోనే ర‌వితేజ మాస్‌లో ఊపు తెప్పించారు. ఇక ఈ మూవీకి దేవీ మ్యూజిక్ అందిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వ‌చ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన మూడో సింగిల్‌ను రిలీజ్ చేశారు.

అట్ట సూడ‌కే అంటూ అదిరిపోయే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మాస్ సాంగ్‌కు త‌గిన‌ట్టుగా బీట్‌, మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ స్టెప్పులు ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ ఈ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫి అందించారు. కొత్త స్టెప్పుల‌తో మాస్ సాంగ్‌తో ర‌వితేజ కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌ను చేస్తున్నారు. ముకంద‌న్, మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్న‌ది. ఖ‌చ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంద‌ని ర‌వితేజ అభిమానులు చెబుతున్నారు. సాంగ్‌లో ర‌వితేజ కొత్త లుక్‌తో అద‌ర‌గొట్టారు. వ‌య‌సు మీద‌ప‌డుతున్న ర‌వితేజ గ్రేస్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఖిలాడీతో నిరూపించ‌బోతున్నారు ర‌వితేజ‌.

Advertisement

Advertisement