Home » Athidhi Review: తెలుగు హార్రర్‌ వెబ్‌ సిరీస్‌.. వేణు ‘అతిథి’ రివ్యూ

Athidhi Review: తెలుగు హార్రర్‌ వెబ్‌ సిరీస్‌.. వేణు ‘అతిథి’ రివ్యూ

by Bunty
Ad

అలనాటి హీరో వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు… రవితేజ హీరోగా చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించాడు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేశాడు వేణు. ఇక తాజాగా అతిధి అనే పేరుతో ఓ హారర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 19వ తేదీ అంటే ఇవాళ ఓటిటి లో అతిధి సినిమా రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో వేణు నటించిన ఈ హారర్ మూవీ రిలీజ్ అయింది.

 

Advertisement

కథ మరియు వివరణ

వేణు నటించిన అతిధి సినిమా కథ వివరాల్లోకి వెళితే….ఈ సినిమాలో వేణు పాత్ర పేరు రవి. సంధ్య ( అతిధి గౌతం), మరియు రవి ఇద్దరు దంపతులు. వీరిద్దరే ఓ పెద్ద ఇంట్లో ఉంటారు. భార్య కాళ్లు చచ్చు బడిపోవడంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు రవి. ఓ వర్షం కురిసిన రాత్రి ఆ ఇంటికి మాయ అనే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత యూట్యూబర్ సవేరి కూడా వస్తాడు. రవి ఇంటికి సమీపంలోని దయ్యాల మిట్టలో ఏ ఆడ దయ్యం లేదని వీడియో చేయడానికి వచ్చిన సవేరికి దయ్యం కనిపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రవి ఇంటికి వస్తాడు. వాళ్ల వెనుక ప్రకాష్ కూడా వస్తాడు.

Advertisement

 

మాయా తనను వెంటాడుతూ వచ్చిన దయ్యం అని సవేరి భయపడతాడు. ఆమె దయ్యం కాదని రవి చెబుతూ ఉంటాడు. నిజంగా మాయ దయ్యమా ? లేదంటే అసలు దయ్యం ఇవ్వరు ? అసలు రవి భార్య సంధ్యాను ఎవరైనా చూశారా ? అసలు ఈ సినిమాలో నిజంగానే దయ్యం ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా చూస్తేనే పూర్తిగా కథ అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి చాలా అద్భుతంగా నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ నటనను పండించారు. హారర్ సినిమా కాబట్టి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా భయపడతారు. భయానక సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అయితే రొటీన్ కథ కావడంతో… సినిమా కాస్త డల్ కావచ్చు అని చెబుతున్నారు.

 

ప్లస్ పాయింట్స్

కథ

హారర్ సీన్స్

వేణు తొట్టెంపూడి

 

మైనస్ పాయింట్స్ 

రొటీన్ సీన్స్

దర్శకత్వం

 

రేటింగ్ 2/5

Visitors Are Also Reading